నిశ్చితార్థానికి వెళ్తుండగా విషాదం : కరెంట్ షాక్ తో 8 మంది మృతి

ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 11:57 AM IST
నిశ్చితార్థానికి వెళ్తుండగా విషాదం : కరెంట్ షాక్ తో 8 మంది మృతి

Updated On : February 9, 2020 / 11:57 AM IST

ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.

పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తుండగా విషాదం నెలకొంది. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 11కేవీ హై ఓల్టేజీ విద్యుత్ తీగలు తగిలి బస్సుకు మంటలు అంటుకున్నాయి. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వేడుకకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

గాయపడిన వారిని చికిత్స కోసం డెహ్రాన్ పూర్ లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. పెళ్లి వేడుకకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చిక్కనాగా ప్రాంతం నుంచి జంగల్ పాడుకు బస్సులో వెళ్తున్నారు. 11 కేవీ హై వోల్టేజ్ వైర్లు బస్సుకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి ఒక్కసారిగా చెలరేగాయి. ప్రయాణిస్తున్న సమయంలో ఘటన జరగడంతో బస్సులో చాలా మంది చిక్కుకున్నారు. కరెంట్ షాక్ తో 8 మంది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి.

డెహ్రాన్ పూర్ ఎస్పీ ఈ ఘటనపై స్పందించారు. కేవీ వైర్లు ఏ విధంగా తెగిపడ్డాయి? అధికారుల నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు, బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్యం పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటన పట్ల రాష్ట్ర మంత్రులు కూడా స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు.