Encounter In Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Encounter In Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు

ENCOUNTER

Updated On : March 9, 2023 / 2:10 PM IST

Encounter In Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లోని సుక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం కోబ్రా, ఎస్టీఎఫ్ జాయింట్ ఆపరేషన్ చేస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భయంకరమైన ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. భద్రతా బలాగాలు ఘటనాస్థలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Chhattisgarh Encounter : చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన్ కౌంటర్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

ఛత్తీస్ గఢ్ లో తరచుగా ఎన్ కౌంటర్లు జరుగూతూనేవుంటాయి. గతంలో కూడా రాష్ట్రంలో పలు ఎన్ కౌంటర్ల జరిగాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు పోలీసులు, మావోయిస్టులు చనిపోయారు. తాజాాగా మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.