కుంభమేళాలో అగ్నిప్రమాదం : కాలిబూడిదైన నగదు

  • Published By: chvmurthy ,Published On : February 5, 2019 / 11:09 AM IST
కుంభమేళాలో అగ్నిప్రమాదం : కాలిబూడిదైన నగదు

Updated On : February 5, 2019 / 11:09 AM IST

ప్రయాగ్ రాజ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో 2 గుడారాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. భారీగా నగదు కాలి పోయింది. ప్రమాదం గమనించిన అగ్నిమాపకసిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. 
ఈ ప్రమాదంలో గుడారాల్లో ఉంచిన  నగదు పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.జనవరి 15 నుంచి ప్రారంభమైన కుంభమేళా మార్చి 4 వరకు జరుగుతుంది.  ప్రారంభానికి ముందే జనవరి 14న  దిగంబర్ అఖాడా శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు  చెలరేగాయి.