అమెరికాలో మరోసారి కాల్పులు : నలుగురు మృతి

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 12:14 PM IST
అమెరికాలో మరోసారి కాల్పులు : నలుగురు మృతి

Updated On : October 6, 2019 / 12:14 PM IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కెన్సస్ సిటీలోని ఓ బార్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం (అక్టోబర్ 6, 2019) ఉదయం 6.30 గంటలకు బార్ లోకి అడుగు పెట్టిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. పదుల సంఖ్యలో జనాన్ని లక్ష్యం చేసుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 

కెన్సస్ సిటీలోకి పదో, సెంట్రల్ వీధుల గుండా దుండగులు వచ్చినట్టు గుర్తించారు. వారు నేరుగా బార్‌లోకి వచ్చారు. అక్కడ ఉన్న కొందరిని లక్ష్యం చేసుకుని కాల్పలు జరిపారు. అనంతరం నిందితుడు పరారు అయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన దుండగుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు.