ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం : మోడీ, కేజ్రీవాల్ విచారం

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 05:56 AM IST
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం : మోడీ, కేజ్రీవాల్ విచారం

Updated On : December 8, 2019 / 5:56 AM IST

ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై భారత ప్రధాన మంత్రి మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందనిన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు.
Read More : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం : ఫ్యాక్టరీకి అనుమతి లేదా ? 

* అగ్నిప్రమాదంపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఘటనాస్థలికి ఆయన చేరుకుని సహాయక చర్యలు పరిశీలించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అత్యవసర సేవల్లో ఎలాంటి జాప్యం * లేకుండా జాగ్రత్త పడాలని అధికారులకు ఆయన సూచించారు.
* అగ్నిప్రమాద ఘటన జరగడం విషాదకరమని ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ అన్నారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నట్లు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
* కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
* మరోవైపు అగ్నిప్రమాద ఘటనా ప్రదేశానికి కేంద్ర మంత్రులు హారదీప్ పూరి, అనురాగ్ ఠాకూర్ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది చనిపోయారు. ఇరుకు సందులో ఫ్యాక్టరీ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. కానీ తొందరలోనే మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది.