Road Incident : షిరిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మృతులు యాదాద్రి జిల్లా వాసులు
రెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లారు.

Road Incident : మహారాష్ట్రలో రహదారులు రక్తమోడాయి. షిరిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు మృతి చెందారు. 8మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆరు నెలల చిన్నారి కూడా ఉంది.
మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప వాసులుగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. రెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లారు. మృతుల వివరాలు- ప్రేమలత (59), వైద్విక్ నందన్ (6 నెలలు), అక్షిత (20), ప్రసన్న లక్ష్మి(45).
ఈ ఘటనతో కొండగడపలో తీవ్ర విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్లిన వారు విగతజీవులుగా మారడం చూసి బోరున విలపిస్తున్నారు.
Also Read : కుమారుడిని చూడడానికి కాలేజీ హాస్టల్‌కి వెళ్లిన తల్లిదండ్రులు.. వారికి విగతజీవిగా కనపడిన కొడుకు