కిరాతకుడు : ఫ్రెండ్ కూతుర్ని 7వ ఫ్లోర్ నుంచి విసిరేసాశాడు

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 05:12 AM IST
కిరాతకుడు : ఫ్రెండ్ కూతుర్ని 7వ ఫ్లోర్ నుంచి విసిరేసాశాడు

Updated On : September 8, 2019 / 5:12 AM IST

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి మృతదేశం ఛిద్రమైపోయి పడి ఉంది. ముంబైలోని కొలాబాలోని అశోకా అపార్ట్‌మెంట్ బ్లాక్ Aలో (సెప్టెంబర్ 70)రాత్రి ఈ దారుణం చోటుచేసుకున్న  ఈ దృశ్యం చూసివారందరి హృదయం ద్రవించిపోయింది. అపార్ట్ మెంట్ కింద దబ్ మంటూ శబ్ధం రావటంతో ఏంటాని అపార్ట్ మెంట్ వాసులంతా చూశారు. రక్తపు మడుగులో మూడేళ్ల చిన్నారి శరీరం ముక్కలు ముక్కలుగా అయి పడి ఉంది. ఆ దారణం దృశ్యం చూసినవారంతా షాక్ గురయ్యారు. తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 

ఆ పాప అపార్ట్ మెంట్ 7వ ఫ్లోర్ లో ఉండే షనాయాగా గుర్తించారు. మూడేళ్ల షయాని కిటికీ నుంచి పడి ఉందని అనుకున్నారు. కానీ మూడేళ్ల పాప అంత ఎత్తులో ఉన్న విండోలోకి ఎలా ఎక్కగలదనే అనుమానం వచ్చింది. దీంతో అపార్ట్‌మెంట్‌ లోంచి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా..బైటవారెవరూ లోపలికి రాకుండా అన్ని గేట్లు క్లోజ్ చేశారు.బ్లాక్ చేశారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితిని సమీక్షించి విచారణ ప్రారంభించారు. విచారణలో తేలిన విషయం విని వారంతా ఆశ్చర్యపోయారు. షయానా తండ్రికి స్నేహితుడే కిటీకి నుంచి పాపను కిందికి విసిరేశాడని తేలింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

షయాని తండ్రి ఫ్రెండ్ పేరు అనిల్ చుగానీ.అతని వయస్సు 40. షయానా ఇంటికి వచ్చిన అనిల్ అక్కడే మరో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న షయానాని బలవంతంగా ఎత్తుకుని కిటికీ లోంచీ కిందకు విసిరేశాడు. కానీ అనిల్ చుగానీ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వెంటనే అనిల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తి అయిన అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన…అపార్ట్‌మెంట్ వాసుల్ని తీవ్రంగా కలిచివేసింది.కిలకిలా నవ్వుతూ. ఆడుకుంటూ తిరిగే పసి పాప…ఇంతటి దారుణానికి బలైపోవటంవారిని కలచివేసింది. అనిల్ చుగానీ ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది.