గోవా డీజీపీ కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : November 16, 2019 / 03:28 AM IST
గోవా డీజీపీ కన్నుమూత

Updated On : November 16, 2019 / 3:28 AM IST

గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూశారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న నందా  శనివారం(నవంబర్-16,2019) తెల్లవారుజామున నందా గుండెపోటుతో మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. డీజీపీ నందా ఆకశ్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవా డీజీపీగా నందా బాధ్యతలు చేపట్టారు.

డైనమిక్ ఆఫీసర్ గా పేరు ఉన్న నందా ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి అనంతరం సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్‌లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు.

కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ పోలీసు మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ లభించాయి.