Mother”s Boy Friend : తల్లి ప్రియుడ్ని హత్య చేసిన మైనర్ బాలుడు

కన్నతల్లిని హింసిస్తున్న వ్యక్తిని 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యచేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో చోటు చేసుకుంది. స్నేహితులతో గడుపుతూ చదువుకుంటూ భవిష్యత్తులో ప్రయోజకుడవ్వాల్సిన బాలుడు తల్లి చేసిన ఒక చిన్న తప్పిదం కారణంగా హంతకుడిగా మారిపోయాడు.

Mother”s Boy Friend : తల్లి ప్రియుడ్ని హత్య చేసిన మైనర్ బాలుడు

Mothers Boy Friend

Updated On : May 21, 2021 / 8:27 PM IST

Mother”s Boy Friend : కన్నతల్లిని హింసిస్తున్న వ్యక్తిని 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యచేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో చోటు చేసుకుంది. స్నేహితులతో గడుపుతూ చదువుకుంటూ భవిష్యత్తులో ప్రయోజకుడవ్వాల్సిన బాలుడు తల్లి చేసిన ఒక చిన్న తప్పిదం కారణంగా హంతకుడిగా మారిపోయాడు.

అహమ్మాదాబాద్ కి చెందిన వివాహిత మహిళ 10 ఏళ్ల క్రితం,  భర్తను  విడిచిపెట్టి  నాలుగేళ్ల కొడుకుతో కలిసి తన ప్రియుడితో పారిపోయింది. అప్పటినుంచి వారు ముగ్గురు కలిసి జీవించసాగారు. కొన్నాళ్ళకు ఆ వ్యక్తి నిజస్వరూపం తెలియ సాగింది. రాన్రాను ఆ వ్యక్తి తన తల్లిని కొట్టటం ప్రారంభించాడు. అదంతా చూస్తున్న ఈ చిన్నారి మనసులో ఆ వ్యక్తిపై పగ పెరగసాగింది.

తల్లిని ఎందుకు కొడుతున్నావని అడిగినందుకు ఆ చిన్నారి కూడా పెంపుడు తండ్రి చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది.  ఇప్పడు ఆబాలుడికి 14 ఏళ్లు వచ్చాయి. బాలుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ తల్లి ప్రియుడ్ని అడ్డు తొలగించుకోవాలనే అభిప్రాయం బలపడసాగింది.

ఈనెల 17వ తేదీన పెంపుడు తండ్రిని బైక్ పై ఎక్కించుకుని అహమ్మదాబాద్ లోని   బెహ్రాంపూర్ ప్రాంతంలో ఉన్న కాలికో వస్త్రపరిశ్రమ కాంపౌండ్ వద్దకు తీసుకు వెళ్ళాడు.  తనతో తెచ్చుకున్నకత్తితో అతడ్ని కసితీరా పొడిచి హత్య చేశాడు. చచ్చిపోయాడని  నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

సమచారం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో హత్యకు పాల్పడింది మైనర్ బాలుడనే విషయం తెలుసుకుని, బాలుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. చనిపోయిన వ్యక్తి తనను, తల్లిని ప్రతిరోజు చిత్ర హింసలకు గురిచేసేవాడని… నరకం చూపించేవాడని అందుకే అతడ్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.