టార్చర్ చూపించింది : లవర్ వేధిస్తుందంటూ పోలీసుల ఎదుటే..

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 06:35 AM IST
టార్చర్ చూపించింది : లవర్ వేధిస్తుందంటూ పోలీసుల ఎదుటే..

Updated On : March 26, 2019 / 6:35 AM IST

లంగర్ హౌస్ : సాధారణంగా యువకులు ప్రేమ పేరుతోను..ప్రేమించకుంటే చంపేస్తామనీ..యాసిడ్ పోస్తామని యువతులను వేధించే ఘటనలు వింటుంటాం..తమకు రక్షించమని పోలీసులకు ఫిర్యాదు చేయటం కూడా విన్నాం. ఇక్కడ సీన్ రివర్స్. ఓ యువకుడు తన ప్రియురాలు వేధిస్తోందనీ.. ఆమె నుంచి కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ తో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అప్పటికీ పోలీసులు నమ్మలేదు. దీంతో పోలీసుల ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్ సిటీలోని లంగర్ హౌస్ మార్చి 25వ తేదీ జరిగింది.

లంగర్ హౌస్ పరిధిలోని గొల్లబస్తీలో నివాసం ఉంటన్న ఆదిల్ అనే 25 ఏళ్ల యువకుడు DLFలో పని చేస్తున్నాడు. క్లాస్ మేట్ అయిన యువతిని ప్రేమించాడు.  విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసిందనే భయంతో ఆదిల్ పై ఫోన్ లో తిట్ల పురాణం అందుకుంది. పదే పదే ఫోన్ చేసి తిడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆదిల్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లవర్ పై కంప్లైంట్ చేశాడు.

అంతటితో ఊరుకోకుండా కూడా తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో షాక్ అయిన పోలీసులు.. వెంటనే మంటలను ఆర్పారు. చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదిల్ పరిస్థితి బాగానే ఉందనీ.. అతడి కంప్లయింట్ తో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ప్రకటించారు.