నీకెంత ధైర్యం.. నా దారికే అడ్డు వస్తావా? మద్యం మత్తులో పామును కొరికి ముక్కలు చేశాడు!

మద్యం మత్తులో ఓ మందుబాబు.. రోడ్లుపై పామును పట్టుకుని పళ్లతో కొరికి ముక్కులు చేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రోడ్డు మీద వెళ్తున్న ఓ పామును.. బైక్‌పై వెళ్లే మందుబాబు పట్టుకున్నాడు. నా దారికే అడ్డం వస్తావా? నీకెంత ధైర్యం అంటూ గట్టిగా అరుస్తూ తాగిన మైకంలో ఆ పామును పళ్లతో కొరికి ముక్కలు చేశాడు.
ఈ ఘటన కర్ణాటక కోలార్‌లో ప్రాంతంలో మంగళవారం జరిగింది. పామును కొరికి ముక్కలు చేయడం చూసిన స్థానికులంతా నివ్వేరపోయారు. అతడు కుమార్ అనే వ్యక్తిగా గుర్తించారు. పామును ముక్కలు చేస్తున్నంత సేపు గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సోమవారం మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశవ్యాప్తంగా అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగాయి.
పగటిపూట భౌతిక దూర నిబంధనలను ఉల్లంఘించడం, పెద్దమొత్తంలో మద్యం కొనుగోలు చేయడం కనిపించింది. ఇలాంటి సంఘటనలో ఒక వ్యక్తి కర్ణాటక బెంగళూరులో రూ.52,000 మద్యం కొన్నాడు. మరో సంఘటన బెంగళూరులోని సుంగట్కట్టే ప్రాంతం నుండి మనిషి కాలువలో పడి తలకు గాయం కావడంతో మరణించాడు. కర్ణాటక రాష్ట్రం సోమవారం రూ .45 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను నమోదు చేసింది.
Also Read | మందు కావాలా : గ్రీన్ జోన్లలో ఇంటి వద్దకే లిక్కర్