పక్కింటి ఆంటీతో ఎఫైర్, ఇద్దరూ పరార్, చివరికి ఊహించని ఘోరం
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో

వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. పక్కింటి ఆంటీతో ఎఫైర్ అతడి ప్రాణం తీసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు దూరం చేశాడన్న కక్షతో ఓ వ్యక్తి యువకుడిని కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కీమ్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కేతరబండ తండాలో జరిగింది. తండాకు చెందిన నర్సింగ్ నాయక్ భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వారికి ఇంటికి సమీపంలో ఉండే రాములు నాయక్(26) ఆమెపై మనసు పడ్డాడు. అప్పటికే అతడికి వివాహమై ఇద్దరు పిల్లలున్నా ఆమెపై కన్నేశాడు.
నర్సింగ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఆమెతో మాటలు కలిపిన రాములు లొంగదీసుకున్నాడు. నర్సింగ్‌కు తెలియకుండా కొన్నాళ్లు అక్రమ సంబంధం గుట్టుగా సాగింది. ఇద్దరూ ఒకరిని విడికి ఒకరు ఉండలేని స్థితికి చేరడంతో 2016లో రాములు ఆమెను తీసుకుని తండా నుంచి పారిపోయాడు. దీంతో రాములు తన భార్యను కిడ్నాప్ చేశాడని నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంటను వెతికి పట్టుకుని రాములును జైలుకు పంపారు.
అయితే ఆ మహిళ నర్సింగ్‌తో ఉండేందుకు ఇష్టపడక వేరుగా ఉంటోంది. దీంతో తండాలో తన పరువు తీయడమే కాకుండా భార్యను తనను కాకుండా చేసిన రాములుపై నర్సింగ్ కక్ష పెంచుకున్నాడు. ఓ రాత్రి భార్య, పిల్లలతో ఆరుబయట నిద్రిస్తున్న రాములును గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. రాములు భార్య బుజ్జి ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నర్సింగ్‌పై హత్యకేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.