రాష్ట్రంలో గన్ పౌడర్ అక్రమ రవాణా
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు సరఫరా అవుతున్న గన్‌పౌడర్ కేసును పోలీసులు పట్టుకున్నా.. దర్యాప్తు మాత్రం ముందుకు కదలడం లేదు. గన్‌పౌడర్ కరీంనగర్‌లో ఎక్కడికి సరఫరా అవుతుంది?. అక్కడ ఎంత మంది చేతులు మారుతుంది?. ప్రమాదకర పౌడర్ నక్సల్స్‌కు ఏమైనా చేరుతోందా?. అనేది పోలీసు విచారణలో తేలటంలేదు.

hyderabad to karimnagar gunpowder illegal transport : హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు సరఫరా అవుతున్న గన్‌పౌడర్ కేసును పోలీసులు పట్టుకున్నా.. దర్యాప్తు మాత్రం ముందుకు కదలడం లేదు. గన్‌పౌడర్ కరీంనగర్‌లో ఎక్కడికి సరఫరా అవుతుంది?. అక్కడ ఎంత మంది చేతులు మారుతుంది?. ప్రమాదకర పౌడర్ నక్సల్స్‌కు ఏమైనా చేరుతోందా?. అనేది పోలీసు విచారణలో తేలటంలేదు.
బొగ్గు గనులు, క్వారీల పేలుళ్లలో ఉపయోగించే డిటోనేటర్లను తయారు చేసేందుకు ఉపయోగించే గన్‌పౌడర్ అక్రమ రవాణా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సప్లై అవుతుండటంతో ఉలిక్కిపడ్డ పోలీసులు.. ఈ దందాపై ఫోకస్ పెట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసును విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు చేరుతున్న గన్‌పౌడర్ అక్కడి నుంచి మావోల చేతికి అందుతోందనే విషయం దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
గన్ పౌడర్‌ను తయారు చేస్తున్న షబ్బీర్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు అదుపులోకి తీసుకునేంత వరకు దూకుడుగా వ్యవహరించిన పోలీసులు.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు ప్రచారం మొదలైంది. అక్రమంగా గన్‌పౌడర్‌ను తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు సహకరించడం వెనుక కారణాలు ఏంటనేది తేలాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరిన గన్‌పౌడర్ ఎవరికి చేతుల్లోకి వెళ్తోంది. ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలను మాత్రం ఇప్పటి వరకు పోలీసులు బహిర్గతం చేయటంలేదు.
చిన్న దొంగతనం జరిగితేనే పెద్ద డెమో చేసే పోలీసులు.. ఇంత పెద్ద కేసు వెలుగు చూసినా.. ఎందుకు ప్రజలకు క్లుప్తంగా వివరించలేకపోతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. పోలీసులపై ఒత్తిడి పెరగడంతోనే కేస్‌ను సైలెంట్ చేశారని, విచారణను పక్కన పెట్టేశారనే ప్రచారం సాగుతోంది. అక్రమ దందాలో ఎవరి వాటాలు ఎంత, ఉందో తేలాల్సి ఉంది.