కోడెల మరణం విషాదకరం : పవన్ కళ్యాణ్

  • Published By: chvmurthy ,Published On : September 16, 2019 / 10:01 AM IST
కోడెల మరణం విషాదకరం : పవన్ కళ్యాణ్

Updated On : September 16, 2019 / 10:01 AM IST

టీడీపీ సీనియర్  నేత మాజీ మంత్రి, ఏపీ మొదటి స్పీకర్ కోడెల మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  అన్నారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుది శ్వాస విడవటం షాక్  గురి చేసిందని  తన సంతాప సందేశంలో పవన్ కళ్యాణ్ అన్నారు.

రాజకీయవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఎన్నో పదవులను అలంకరించారని ఆయన తెలిపారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై… రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేది..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.ఈ ఆపత్కాల సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున తీవ్ర సంతాపం తెలియచేస్తున్నాను అని  పవన్ కళ్యాణ్ సంతాప సందేశంలో  అన్నారు.