టాయిలెట్ గోడలపై మహిళా పోలీసు ఫోన్ నెంబర్-అసభ్య కాల్స్ తో ఉక్కిరి బిక్కిరి

టాయిలెట్ గోడలపై మహిళా పోలీసు ఫోన్ నెంబర్-అసభ్య కాల్స్ తో ఉక్కిరి బిక్కిరి

Updated On : December 25, 2020 / 5:09 PM IST

lewd calls co-student wrote number in toilet : సైకో లు ఒక్కోక్కరూ ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు. తమతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ధీటుగా సమాధానం చెప్పిందని ఆమె ఫోన్ నెంబర్ టాయిలెట్ గోడలపై రాసాడు  ఓ సైకో.  ఆ ఫోన్ నెంబరు ఒక వేశ్యది అనుకుని…. చాలా మంది ఆమెకు ఫోన్ చేసి వేధించటం మొదలెట్టారు. దీంతో ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

కర్ణాటకలోని చిక్ మగళూరుకు చెందిన సతీష్ (33),  బాధితురాలు (32) చిన్నప్పుడు ఒకే స్కూలులో కలిసి చదువుకున్నారు. సతీష్ స్కూల్ టీచర్ గా పని చేస్తుండగా… బాధితురాలు పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది.  మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్ధులంతా కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు.   అనంతరం అందరూ కలిసి వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసుకుని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం మొదలెట్టారు.

ఈ క్రమంలో సతీష్, బాధితురాలి పర్సనల్ వాట్సప్ కు ప్రత్యేకంగా మెసేజ్ లు, ఫోన్ కాల్స్  చేస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించటం మొదలెట్టాడు. కొన్నాళ్లు సహనం వహించిన బాధితురాలు ఇంక అతని చేష్టలకు ధీటుగా సమాధానం ఇవ్వటం మొదలెట్టింది. కంగుతిన్న సతీష్ బాధితురాలిని వాట్సప్ గ్రూపు నుంచి తొలగించాడు.  ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మిగిలిన స్నేహితులు నచ్చ చెప్పి ఆమెను తిరిగి గ్రూపు లో యాడ్ చేశారు. అనవసరంగా తన విషయంలో కల్పించుకోవద్దని బాధితురాలు సతీష్ కు వార్నింగ్ ఇచ్చింది. అది మనసులో పెట్టుకున్న సతీష్ ఆమెపై పగ పెంచుకున్నాడు.

ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు.  చేసేది టీచర్ ఉద్యోగం అయినా చాలా నీచంగా ఆలోచించాడు.  కడూర్ బస్టాండ్ లోని పురుషుల టాయిలెట్ గోడలపై బాధితురాలి ఫోన్ నెంబర్ రాసి,  ఆమెను సంప్రందించాలని నీచంగా  వర్ణిస్తూ రాశాడు.  ఆమెను సెక్స్ వర్కర్ గా భావించిన పలువురు పురుషులు… బాధితురాలైన మహిళా పోలీసుకు ఎడతెరిపిలేకుండా ఫోన్ కాల్స్ చేశారు.  అసభ్యంగా మాట్లాడటం మొదలెట్టటంతో ఆమె షాక్ కు గురయ్యింది. పరిస్ధితిని అర్ధం చేసుకున్న బాధితురాలు తనపై అధికారులకు సతీష్ పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు.  తమదైన స్టైల్లో విచారించటంతో చేసిన నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354డీ. 509 ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.