వివాహేతర సంబంధం–అనుమానంతో ప్రియురాలి హత్య

Maharashtra man killled woman refuse marry him, ghatkesar : భర్తతో విడిపోయి జీవిస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఆమెను పెళ్లి చేసుకోవాలను కున్నాడు. అందుకామె అంగీకరించలేదు. వేరే వారితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో ఆమెను హత్యచేసిన వ్యక్తి ఉదంతం ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
శ్రీకాకుళంకు చెందిన లిమ్మ సంతోష(28) అనే మహిళ భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింట్లో తల్లితండ్రులతోకలిసి రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఏదులాబాద్ లో నివసిస్తోంది. అదే ప్రాంతంలో నివసిస్తున్నమహారాష్ట్రకు చెందిన వినోద్ పరశురాం(28) ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
పెళ్లి చేసుకోమని పరుశురాం సంతోష ను అడగ్గా అందుకు ఆమె అంగీకరించలేదు. అదీ కాకుండా ఆమె ఇతరులతోసన్నిహితంగా ఉండటాన్ని పరుశురాం జీర్ణించుకోలేకపోయాడు. గతేడాది డిసెంబర్ 3వ తేదీన తాడుతో ఉరివేసి సంతోషను హత్యచేశాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరిగుతున్న పరుశురాం ను శామీర్ పేట మండలం తూముకుంటలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.