Constable Raped Woman : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై లైంగిక దాడి చేసిన కానిస్టేబుల్

 కంచె చేను మేసిన చందంగా చేసాడో కానిస్టేబుల్. భర్త బాధలనుంచి రక్షించాల్సిన పోలీసు కానిస్టేబుల్ మహిళలై లైంగిక దాడి చేసిన ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

Constable Raped Woman : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై లైంగిక దాడి చేసిన కానిస్టేబుల్

Gujarat Police Reped Woman

Updated On : July 16, 2021 / 5:38 PM IST

Constable Raped Woman : కంచె చేను మేసిన చందంగా చేసాడో కానిస్టేబుల్. భర్త బాధలనుంచి రక్షించాల్సిన పోలీసు కానిస్టేబుల్ మహిళలై లైంగిక దాడి చేసిన ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. భర్త నుంచి వరకట్న వేధింపులు ఎదుర్కోంటున్న మహిళ.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటానికి వెళితే, ఆమహిళను లోబరుచుకుని లైంగికదాడి చేసిన కానిస్టేబుల్ పై పోలీసులు కేసునమోదు చేశారు.

అహ్మదాబాద్‌లో నివసించే మహిళ (38) తన మాజీ భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసేందుకు మూడేళ్ల క్రితం స్ధానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. మహిళ వద్ద ఫిర్యాదు తీసుకున్న అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కేసు దర్యాప్తులో భాగంగా ఆ కానిస్టేబుల్ మహిళతో పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళను పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి మహిళను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లోబరుచుకున్నాడు.

పెళ్లి పేరుతో మూడేళ్లలో తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కోంది. అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌లో తనతో గడపాలని కూడా కోరాడని, హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని కూడా మహిళ ఆరోపించింది. అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మే నెలలో తనపై దాడిచేసి కొట్టాడని ఆరోపించింది.

ఆసమయంలో కేసు ఉపసంహరించుకునేందుకు తనకు డబ్బులు ఇవ్వచూపాడని ఆమె ఆరోపించింది. మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376-ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.