man cheated the astrologer : కేసీఆర్ పీఏ అని చెప్పి జ్యోతిష్యుడు వద్ద రూ. 25లక్షలు కొట్టేసిన మోసగాడు
శాస్త్రాలు చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు తన జాతకం తాను తెలుసుకోలేక రూ. 25 లక్షల రూపాయలు మోసపోయిన జ్యోతిష్యుడు ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.

Man Cheated Astroliger By The Name Of Cm Kcr Pa
man cheated the astrologer for Rs.25 lakh by claiming to be the CM KCR PA : శాస్త్రాలు చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు తన జాతకం తాను తెలుసుకోలేక రూ. 25 లక్షల రూపాయలు మోసపోయిన జ్యోతిష్యుడు ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.
ఎస్సార్ నగర్ లో దేవీ శైలైంద్రనాధ్ అనే జ్యోతిష్యుడు జాతకాలు చెప్పుకుని జీవనం సాగించేవాడు. స్ధానికంగా మంచి సిధ్ధాంతి అని పేరు తెచ్చుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతని దగ్గరకు సుధాకర్ అనే వ్యక్తి జాతకం చెప్పించుకోటానికి వచ్చాడు. తాను సీఎం కేసీఆర్ కు పీఏ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. తన వెంట ఇద్దరు గన్ మెన్లను కూడా తెచ్చుకున్నాడు.
అతని బిల్డప్ చూసి నిజమని నమ్మాడు శైలేంద్రనాధ్. మరింత నమ్మకం కలిగేందుకు సుధాకర్ పలుమార్లు జాతకం చెప్పించు కోటానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం బాగా పెరిగింది. ఒకసారి సుధాకర్ మాట్లాడుతూ కూకట్ పల్లి లోని ప్రైమ్ లొకేషన్ లో గవర్నమెంట్ స్ధలం ఉందని….అది సీఎం తో చెప్పి మీకు ఇప్పించేలా చేస్తానని ఆశ కల్పించాడు.
అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఓపెన్ చేస్తే మంచి గిరాకీ వస్తుందని ఊరించాడు. సుధాకర్ మాటలు నమ్మిన శేలేంద్రనాధ్ విడతలవారీగా రూ.25లక్షలు సమర్పించుకున్నాడు. అయితే డబ్బులిచ్చి రెండేళ్లు గడిచినా సుధాకర్ స్ధలం విషయం మాట్లాడటం లేదు. ఇటీవల స్ధలం విషయం గట్టిగా నిలదీసి అడిగేసరికి…..గన్ మెన్ తో కాల్చి చంపేస్తానని బెదిరించాడు.
దీంతో తాను మోసపోయానని గ్రహించని శైలేంద్రనాధ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు సుధాకర్ అనే వ్యక్తి సీఎంఓ లో ఉన్నాడా లేదా అనే కోణంలో ఎంక్వైరీ మొదలెట్టారు.