Man Killed Wife : భార్యను చంపి కరోనాతో చనిపోయిందని నమ్మించాడు

వనస్ధలిపురానికి చెందిన విజయ్ కొద్ది రోజుల క్రితం భార్య కవితను హత్య చేశాడు. ఆమె కరోనాతో మరణించిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశాడు

Man Killed Wife : భార్యను చంపి కరోనాతో చనిపోయిందని నమ్మించాడు

Husband Killed Wife

Updated On : July 3, 2021 / 1:37 PM IST

Man Killed Wife : కరోనా కష్టకాలం చాలామంది జీవితాలను అతలాకుతలం చేసేసింది. ఉపాధిలేక కొందరు బాధలు పడితే.. కరోనా వైరస్ బారిన పడి మరికొన్ని జీవితాలే ముగిసిపోయాయి. కరోనా కొందరు దుర్మార్గులకు సాకుగా దొరికింది. ఇటీవల తిరుపతిలో భార్యను చంపి…కరోనా సోకి మరణించిందని చెప్పి కన్న కూతురు ఎదుటే కాల్చి వేసిన దారుణ ఘటన మరువక ముందే హైదరాబాద్ వనస్ధలిపురంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

వనస్ధలిపురానికి చెందిన విజయ్ కొద్ది రోజుల క్రితం భార్య కవితను హత్య చేశాడు. ఆమె కరోనాతో మరణించిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే విజయ్‌పై అనుమానం వచ్చిన అత్తమామలు తమ కూతురు కరోనాతో మృతి చెందలేదని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కే

సు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆమె కరోనాతో మరణించలేదని వైద్యులు రిపోర్టు ఇచ్చారు. దీంతో పోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.