Gang Rape: నైట్ డ్యూటీకి వెళ్లిన భర్త.. ఇంట్లోకి చొరబడిన యువకులు.. రెండోసారి భరించలేక పోలీసులను ఆశ్రయించిన మహిళ ..
హతిన్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భార్యభర్తలు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎక్కువగా భర్త నైట్ డ్యూటీకి వెళ్తుంటాడు. స్థానికంగా ఉండే ఐదుగురు యువకులు ఫిబ్రవరి 4న రాత్రి మహిళ భర్త నైట్ డ్యూటీకి వెళ్లడాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో మహిళ చిన్నపిల్లలతో కలిసి నిద్రిస్తోంది. యువకులు ఆమె దగ్గరకు వెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో...

married Woman gangraped
Gang Rape: భర్త నైట్ డ్యూటీకి వెళ్లడాన్ని గమనించిన ఐదుగురు యువకులు అర్థరాత్రివేళ ఇంట్లోకి ప్రవేశించి మహిళపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించారు. మహిళ ప్రతిఘటించడంతో చంపుతామని బెదిరించి సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. అయితే, రెండోసారి అదే పరిస్థితి ఎదురవడంతో మహిళ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఐదుగురు యువకులపై కేసు నమోదు చేసి వారి ఆచూకీకోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని పాల్వాల్‌లోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Girl Gang Rape Drama : బాబోయ్.. ప్రియుడిని దక్కించుకునేందుకు గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన యువతి
మహిళా స్టేషన్ ఇన్‌చార్జి సుశీలాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. హతిన్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భార్యభర్తలు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎక్కువగా భర్త నైట్ డ్యూటీకి వెళ్తుండేవాడు. స్థానికంగా ఉండే ఐదుగురు యువకులు ఫిబ్రవరి 4న రాత్రి మహిళ భర్త నైట్ డ్యూటీకి వెళ్లడాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో మహిళ చిన్నపిల్లలతో కలిసి నిద్రిస్తోంది. యువకులు ఆమె దగ్గరకు వెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో మహిళ ప్రతిఘటించింది. తమకు సహకరించకుంటే చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు బాధను దిగమింగుకొని వారికి సహకరించింది. దీంతో ఐదుగురు యువకులు ఆ మహిళపై అత్యాచారంకు పాల్పడ్డారు.
బయటకు చెబితే పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో ఆ మహిళ ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఫిబ్రవరి 11న మరోసారి భర్త నైట్ డ్యూటీకి వెళ్లడాన్ని గమనించిన యువకులు మళ్లీ మహిళ వద్దకు వెళ్లి తమకు సహకరించాలని బెదిరించారు. దీనికి ఒప్పుకోని మహిళ స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.