Medico Preethi Case Update : ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? పోలీసులకు సవాల్‌గా మారిన మెడికో కేసు
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రీతి మృతికి కారణమైన హానికర ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రీతి శరీరంలో అసలు విషపదార్దాలేవీ డిటెక్ట్ కాలేదని రిపోర్టులో ఉండటం సంచలనంగా మారింది.(Medico Preethi Case Update)

Medico Preethi Case Update : కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రీతి మృతికి కారణమైన హానికర ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రీతి శరీరంలో అసలు విషపదార్దాలేవీ డిటెక్ట్ కాలేదని రిపోర్టులో ఉండటం సంచలనంగా మారింది. అయితే, తమ కుమార్తెది ఆత్మహత్య కాదని హత్య అని ప్రీతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న వేళ.. టాక్సికాలజీ రిపోర్ట్ కొత్త అనుమానాలు రేపుతోంది.
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ప్రీతి మృతికి కారణమైన హానికారక ఇంజెక్షన్ ఏంటనేది ఇంకా తెలియకపోవడమే ఇందుకు కారణం. ప్రీతి మృతి చెంది వారం రోజులు గడిచినా, ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి విషపదార్ధాలు డిటెక్ట్ కాలేదు.
Also Read..Medico Preeti Case : ప్రీతి డెత్ కేసులో కొత్త కోణాలు.. కీలకంగా మారిన డా.స్మృతి అభిప్రాయం
ప్రీతి పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ అటు కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం, ఇటు పోలీసులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే, టాక్సికాలజీ రిపోర్టులో మాత్రం ప్రీతి శరీరంలో అసలు విషపదార్దాలు డిటెక్ట్ కాలేదని తేలడం సంచలనంగా మారింది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్టులో వెల్లడైనట్లు తెలుస్తోంది.(Medico Preethi Case Update)
గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో విష పదార్దాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. ప్రీతి శరీరంలో విష పదార్దాలే లేనప్పుడు ఆమె ఎలా చనిపోయింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. సూసైడ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతిపై వేధింపులకు అనస్థీషియా డిపార్ట్ మెంట్ కూడా కారణం అనే కీలక సమాచారం వస్తుండటంతో ఈ కేసు రోజురోజుకి పోలీసులకు సవాల్ గా మారుతోంది.
మరోవైపు అనస్తీషియా డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ వ్యవహారంపై సందేహాలతో కేసును మరింత లోతుగా విచారణ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు సైఫ్ కస్టడీ ముగియడంతో కేసును జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. 4 రోజుల విచారణలో పోలీసులు సైఫ్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా మరోసారి ప్రీతి తల్లిదండ్రుల స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు.
టాక్సికాలజీ రిపోర్టుపై అనుమానాలు వ్యక్తమవడంపై డాక్టర్లు వివరణ ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతికి రక్తం ఎక్కించిన తర్వాత నమూనాలు తీసుకోవడంతో టాక్సికాలజీ రిపోర్టు సరిగా రాకపోవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఘటన జరిగిన వెంటనే వరంగల్ ఎంజీఎం డాక్టర్లు ప్రీతి రక్తం నమూనాలు సేకరించి ఉంటే, టాక్సికాలజీ రిపోర్టులో సరైన ఫలితం వచ్చేదని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రీతి కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ప్రీతి మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ తో పాటు మరికొంతమంది ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారందరినీ విచారించాలని ప్రీతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కేఎంసీ అనస్తీషియా డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ నాగార్జున రెడ్డి ట్రాన్స్ ఫర్ చేయడం కాదు పూర్తిగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన ఆపరేషన్ థియేటర్ లో ఉన్న వారందరినీ విచారించాలని ప్రీతి తండ్రి నరేందర్ కోరారు.
Also Read..Medico Preeti Case : మెడికో ప్రీతి మృతి కేసులో మరో కీలక ఆధారం లభ్యం
మొత్తంగా టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి కేసు మరో మలుపు తిరిగింది. అసలు విష పదార్దాలేవీ ప్రీతి శరీరంలో లేవని రిపోర్టులో రావడం, నిమ్స్ లో రక్తం మార్చడం వల్లే ఇలా జరిగిందని చెబుతూ ఉండటంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. కేసును అనుమానాస్పద మృతిగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు.