44 మిలియన్ల మైక్రో సాఫ్ట్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లు లీక్‌డ్

44 మిలియన్ల మైక్రో సాఫ్ట్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లు లీక్‌డ్

Updated On : December 8, 2019 / 6:59 AM IST

సైబర్ నేరగాళ్ల వలలో మైక్రో సాఫ్ట్ భారీగా చిక్కుకుపోయింది. 44మిలియన్ మైక్రో సాఫ్ట్ అకౌంట్ల డేటాను హ్యాకర్లు దొంగిలించారు. జనవరి, మార్చి నెలల్లో అన్ని మైక్రోసాఫ్ట్ అకౌంట్ల వివరాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రెగ్యూలర్ చెక్ అప్ లో భాగంగా 3బిలియన్ అకౌంట్లను స్కాన్ చేసిన మైక్రో సాఫ్ట్ తమ డేటాబేస్‌తో పోల్చి చూసుకుంది. 

ఫలితంగా 44మిలియన్ అకౌంట్ల యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లీక్ అయినట్లు గుర్తించారు. తక్షణ కర్తవ్యంగా హ్యాక్ అయిన అన్ని అకౌంట్లకు పాస్ వర్డ్ మార్చుకోవలసిందిగా సూచిస్తుంది ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రో‌సాఫ్ట్. అలాగే కంపెనీల అకౌంట్లను రీసెట్ చేసుకోవాలని అడ్మిన్ లకు వివరించారు. 

మల్టీ ఫ్యాక్టర్ ఆథంటికేషన్(ఎమ్ఎఫ్ఏ) సెక్యూరిటీలో కీలకంగా వ్యవహరిస్తుంది. అకౌంట్లకు సెక్యూరిటీని పెంచడంలోనూ సూచనలు ముందుగానే ఇస్తుంది. సాధారణ నెంబర్లతో మైక్రో‌సాఫ్ట్ అకౌంట్ పాస్ వర్డ్ క్రియేట్ చేస్తే కచ్చితంగా హ్యాకర్లు 99.9శాతం పసిగట్టే అవకాశాలు ఉన్నాయి..