సీపీఐ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 03:22 AM IST
సీపీఐ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం

Updated On : April 4, 2019 / 3:22 AM IST

జనగామ : సీపీఐ నేతలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న కారు ఏప్రిల్ 3 మంగళవారం అర్ధరాత్రి జనగామలో రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

వీరిద్దరు మహబూబాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని.. ఇన్నోవా కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గంమధ్యలో జనగామ వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో ప్రమాదవశాత్తు కారు పడింది. దీంతో సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. మరో వాహనంలో వస్తున్న మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రాజారెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం రోడ్డు దుస్థితిపై కలెక్టర్‌ వినయ్‌క్రిష్ణారెడ్డికి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.