దొంగలు దొరికారు మరి నంది ఎక్కడ

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 03:47 AM IST
దొంగలు దొరికారు మరి నంది ఎక్కడ

Updated On : February 2, 2019 / 3:47 AM IST

తూర్పుగోదావరి : నంది విగ్రహం అపహరణ కేసు ఓ కొలిక్కి వచ్చింది. రామచంద్రాపురం ప్రఖ్యాత శివాలయంలో పురాతన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంగతి తెలిసిందే. అయితే..రోజులు గడుస్తున్నా…విగ్రహం ఆచూకి దొరకకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు గాలింపు..దర్యాప్తును ముమ్మరం చేశారు. 

ఫిబ్రవరి 02వ తేదీ శనివారం నంది విగ్రహం తరలించిన వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. విగ్రహం అపహరణలో దేవేదాయ శాఖ సిబ్బంది హస్తం ఉండవచ్చునని తెలుస్తోంది. కానీ..నంది విగ్రహ వాహనాన్ని సీజ్ చేశారు..కానీ విగ్రహం మాత్రం ఎక్కడుందో తెలియరావడం లేదు. విగ్రహాన్ని దుండగులు పగులగొట్టే ఛాన్స్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

గత నెల 24వ తేదీన రాత్రి నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన తీవ్ర కలకలం రేగింది. 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు…టన్ను బరువు ఉంది ఈ విగ్రహం. ఇంతటి బరువున్న విగ్రహాన్ని ఎలా తీసుకెళ్లారు ? అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. నంది లోపల భాగంగా విలువైన వస్తువులు దాచి ఉంచారని అపహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులు నోరు విప్పితే కాని అసలు కథేంటో తెలియదు.