భర్త ప్రేమ వ్యవహారం తెలిసి నవ వధువు ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : June 6, 2020 / 01:44 AM IST
భర్త ప్రేమ వ్యవహారం తెలిసి నవ వధువు ఆత్మహత్య

Updated On : June 6, 2020 / 1:44 AM IST

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లికూతురు బలవన్మరణానికి పాల్పడింది.  పెళ్లికి ముందే  తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉండటంతో  పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. 

కర్ణాటకలోని మైసూరు కు చెందిన భావన (24) అనే యువతికి నెల రోజుల క్రితం అజయ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహాం జరిగింది. పెళ్లికి ముందే అజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయం దాచిపెట్టి భావనను వివాహం చేసుకున్నాడు.  

పెళ్లైన  కొద్ది రోజులకే  భావన అజయ్ ఫోన్ లో తన భర్త వేరే మహిళతో నగ్నంగా ఉన్న ఫోటోలుచూసి షాక్ కు గురైంది. ఈవిషయం ఇంట్లో పెద్దలకు చెప్పటంతో… రెండు కుటుంబాల వారు కూర్చుని రాజీ కుదిర్చారు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర మానసికి వేదనకు గురైన భావన శుక్రవారం తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read: హైదరాబాద్ లో కత్తులతో పరస్పర దాడి.. ఇద్దరు రౌడీ షీటర్ల హత్య