ఉగ్రవాదులతో లింకులు : హైదరాబాద్‌లో యువతి అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 02:55 PM IST
ఉగ్రవాదులతో లింకులు : హైదరాబాద్‌లో యువతి అరెస్ట్

Updated On : April 21, 2019 / 2:55 PM IST

హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఓ యువతిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వార్దాకు చెందిన మైమున అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులతో మైమునకు లింకులు ఉన్నట్టు గుర్తించారు. వారితో ఆమె ఆన్ లైన్ లో చాటింగ్ చేసినట్టు ఆధారాలు సేకరించారు.

ఎన్ఐఏ అధికారులు శనివారం (ఏప్రిల్ 20,2019) మైలార్ దేవ్ పల్లిలో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో తహా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన బాసిత్, ఖాదర్ ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు తహాని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మైమున అనే యువతిని అరెస్ట్ చేశారు. ఆమె ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరురాలిగా ఉందనే ఆరోపణలతో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులతో ఆమెకున్న సంబంధాల గురించి ఆరా తీస్తున్నారు. యువతి నుంచి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.