ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

  • Published By: chvmurthy ,Published On : February 12, 2019 / 06:48 AM IST
ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

ఢిల్లీ : ప్రవాస భారతీయుల చేతిలో వివాహాల పేరుతో మోసపోతున్న భారతీయ మహిళల రక్షణ కోసం రూపోందించిన కొత్త బిల్లు “ఎన్‌ఆర్‌ఐల వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు-2019” ను కేంద్రం  సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రవాస భారతీయులు భారత్ కు చెందిన మహిళను లేదా విదేశాలలో సహచర ఎన్నారైలని వివాహం చేసుకున్న 30 రోజులలోగా తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే వారి పాస్‌పోర్టు జప్తు చేయబడుతుంది లేదా రద్దవుతుంది. 

ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన ఎన్‌ఆర్‌ఐలు చట్టం ముందు లొంగిపోకపోతే వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కోర్టులకు లభిస్తుంది. కోర్టులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా నిందితులకు సమన్లు, వారంట్లు జారీ చేస్తాయి. ప్రవాస భారతీయులు వివాహం పేరుతో మహిళలను మోసగిస్తున్న కేసులు పెరిగిపోతున్నందున, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం పాస్‌పోర్ట్ చట్టాన్ని, నేర శిక్షా స్మృతిని కూడా సవరించనున్నారు. ఓ ఎన్‌ఆర్‌ఐ భారతీయ మహిళను ఇక్కడ పెళ్ళి చేసుకుంటే స్థానిక చట్టాల ప్రకారం తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. వివాహం విదేశాల్లో జరిగితే అక్కడి నిర్దేశిత అధికారుల వద్ద తమ పెండ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతిపాదిత చట్టం భారతీయ మహిళలను దేశంలో లేదా విదేశాల్లో వివాహం చేసుకొనే ఎన్‌ఆర్‌ఐలకు వర్తిస్తుంది. 

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: ఈఎంఐ కట్టనేలేదు: ఆపిల్ అనుకొని ‘ఐఫోన్’ విసిరాడు