2 బస్సులు, లారీ ఢీ : ఒకరి మృతి, 10మందికి గాయాలు

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీ కొన్నాయి. ఈప్రమాదంలో ఒకరి మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 04:05 AM IST
2 బస్సులు, లారీ ఢీ : ఒకరి మృతి, 10మందికి గాయాలు

Updated On : October 16, 2019 / 4:05 AM IST

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీ కొన్నాయి. ఈప్రమాదంలో ఒకరి మృతి చెందారు.

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీ కొన్నాయి. ఈప్రమాదంలో ఒకరి మృతి చెందారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి. యామిని ట్రావెల్స్ బస్సు 30 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి విజయవాడ వెళ్తోంది. మార్గంమధ్యలో వంతెన దగ్గర డైవర్షన్ బోర్డు లేకపోవడంతో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. 

మొదట డివైడర్ ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..మరో బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన నేరెళ్ల నవీన్ కుమార్, మరో పది మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటినా నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ హెచ్ 5 అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది. బ్రిడ్జీ నిర్మాణంలో ఫ్లైవోర్ స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.