ఇంటిపై కూలిన విమానం : పైలెట్ సహా ఆరుగురు మృతి

చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 08:11 AM IST
ఇంటిపై కూలిన విమానం : పైలెట్ సహా ఆరుగురు మృతి

చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు మృతి చెందారు.

చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ సీ పిలగోస్ ఎయిర్ కెంపెనీకి చెందిన విమానం ఓ ఇంటిపై కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో పైలెట్ సహా ఆరుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ప్యూటో మౌంట్ మేయర్ హ్యారీ జుకెన్ సన్ తెలిపారు. విమానం కూలిన ఇంట్లో ఎవరూ లేరని ప్రకటించారు.