కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు అరెస్ట్ : ఆనందంలో వధువు

కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి.. కొద్ది నిమిషాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో ఊహించని పరిణామం జరిగింది. కల్యాణ

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 01:08 PM IST
కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు అరెస్ట్ : ఆనందంలో వధువు

Updated On : December 8, 2019 / 1:08 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి.. కొద్ది నిమిషాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో ఊహించని పరిణామం జరిగింది. కల్యాణ

కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి.. కొద్ది నిమిషాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో ఊహించని పరిణామం జరిగింది. కల్యాణ మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పీటల మీదున్న పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో వధువు కుటుంబసభ్యులతో పాటు కల్యాణ మండపంలో ఉన్న వారందరిని షాక్ కి గురి చేసింది. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఆనందంగా ఫీల్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. నంద్యాలలో స్థానిక ఆలయంలో మోహనకృష్ణ-లక్ష్మీప్రియల వివాహం జరుగుతోంది. సడెన్ గా కల్యాణ మండపంలోకి వచ్చిన కొందరు వ్యక్తులు.. పెళ్లిని అడ్డుకున్నారు. అంతా చూస్తుండగానే వరుడు మోహనకృష్ణకు దేహశుద్ది చేశారు. ఆ తర్వాత వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుపతిలోని ఎస్బీఐ బ్యాంక్ లో పనిచేస్తున్న మోహనకృష్ణ.. మొదట తమ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని.. తమకు తెలియకుండా మరో యువతిని వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యాడని వారు ఆరోపించారు. నిశ్చితార్థ సమయంలో తమ నుంచి రూ.16లక్షలు కట్నం, 8 తులాల బంగారం తీసుకున్నట్టు ఆరోపించారు. మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని సమాచారం అందడంతో నంద్యాలకు వచ్చి దేహశుద్ది చేశామన్నారు.

మొదట తిరుపతిలో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్న మోహనకృష్ణ.. నంద్యాలలో మరో యువతితోనూ నిశ్చితార్థం చేసుకున్నాడు. రెండో యువతి కుటుంబసభ్యుల నుంచి కూడా భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకున్నాడు. మోహన కృష్ణ అంతకుముందే మరో యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడని తెలియక వారు మోసపోయారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. పెళ్లి తంతుని ఆపేసి .. పీటల మీద ఉన్న వరుడిని అరెస్ట్ చేశారు. సడెన్ గా పెళ్లి ఆగిపోవడంతో వధువు బంధులు కొంత ఆవేదన చెందారు. కానీ నిజం తెలిసి.. ఆనందించారు.