Shilpa Chowdary Custody : శిల్పాచౌదరిని కస్టడీ కోరుతూ మళ్లీ పిటీషన్ వేసిన పోలీసులు
పలువురు ప్రముఖుల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరిని తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

Shilpa Chowary
Shilpa Chowdary Custody : పలువురు ప్రముఖుల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరిని తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. రెండు రోజుల కస్టడీలో శిల్పాచౌదరి విచారణకు సహకరించలేదని పోలీసులు తమ పిటీషన్ లో పేర్కోన్నారు. కస్టడీ సమయాన్ని శిల్పాచౌదరి వృధా చేసిందని తెలిపారు. కాగా పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను ఉప్పరపల్లి కోర్టు సోమవారం విచారించనుంది.
Also Read : Shilpa Chowdary Case : బ్లాక్ మనీని వైట్ చేయమని వాళ్ళంతా డబ్బులు ఇచ్చారు
డబ్బుల విషయం లో శిల్పా నోరు విప్పకపోవడంతో టెక్నికల్, డాక్యుమెంట్స్ పై పోలీసులు దృష్టి పెట్టారు. శిల్పా చౌదరి నివాసంలో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాలు, కాల్ లిస్ట్ అధారంగా కొంతమందికి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. శిల్పాచౌదరి కేసులో కొంతమందిని పోలీసులు సోమవారం విచారణ పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.