Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు

Updated On : December 14, 2022 / 11:01 AM IST

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. 21 మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం ఉత్తర ప్రదేశ్, ఫిరోజాబాద్ పరిధిలో జరిగింది. 50 మంది ప్రయాణికులతో కూడిన ప్రైవేటు బస్సు లూధియానా నుంచి రాయ్ బరేలీ వెళ్తోంది.

Pawan Kalyan Varahi: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రచార వాహనం వారాహి కథ ఇదే!

ఈ క్రమంలో బుధవారం ఉదయం నాలగున్నర గంటల సమయంలో ఆగ్రా-లక్నో రహదారిపై ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసుల, అధికారుల స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీపంలోని సైఫై మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

నిద్ర మత్తులో బస్సు డ్రైవ్ చేయడం వల్ల ట్రక్కును ఢీకొని బోల్తా పడింది. ప్రమాద స్థలం నుంచి బస్సును అధికారులు తొలగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.