క్వారంటైన్ లో మందు కోసం చిందులేసిన బార్ డ్యాన్సర్లు 

  • Published By: murthy ,Published On : May 21, 2020 / 08:44 AM IST
క్వారంటైన్ లో మందు కోసం చిందులేసిన బార్ డ్యాన్సర్లు 

Updated On : May 21, 2020 / 8:44 AM IST

క్వారంటైన్ సెంటర్లో ఉన్న బార్ డ్యాన్సర్లు మద్యం కోసం ఆందోళన చేశారు.  ఉత్తర ప్రదేశ్ లోని మొర్దాబాద్ లో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ముంబైలోని బార్ డ్యాన్సర్లు 72 మంది ఇటీవల ముంబై నుంచి మొర్దాబాద్ కు వచ్చారు. వీరందరినీ పోలీసులు క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. 

వీరికి పరీక్షలు నిర్వహించగా..5 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో మిగిలిన వారందరినీ కూడా క్వారంటైన్ లో ఉంచారు. వీరిలో 40 మంది మహిళలు, 20 మంది పురుషులు, 12 మంది పిల్లలు ఉన్నారు. 
క్వారంటైన్ లో ఉన్న సమయంలో తమకు మద్యం కావాలని కొంతమంది బార్ డ్యాన్సర్లు  అక్కడ  హెల్త్ కేర్ వర్కర్లను  డిమాండ్ చేశారు. 

మందు లేదని చెప్పే సరికి వారు క్వారంటైన్ భవనం కారిడార్ లో డ్యాన్సులు చేస్తూ గందర గోళం సృష్టించారు. తమకు మందైనా సప్లై చేయాలని లేదా ఇంటికైనా పంపించాలంటూ వాళ్లు  ఆందోళనకు దిగారు. క్వారంటైన్ గడువు ముగిసాకే ఇంటికి పంపుతామని అప్పటి దాకా ఇక్కడే ఉండాలని హెల్త్ కేర్ వర్కర్క్ చెప్పారు. ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఆ వీడియో ఇప్పుడ వైరల్ గా మారింది.

బార్ డ్యాన్సర్లు ఆందోళన విరమించకపోయే సరికి పోలీసులు వీరి మీద కేసు నమోదు చేశారు. వీరిని ముంబై నుంచి మొర్దాబాద్ తీసుకువచ్చిన ట్రక్కు డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఎలాంటి అనుమతులు లేకుండానే డ్రైవర్ వీరిని ముంబై నుంచి మొర్దాబాద్ తీసుకువచ్చాడని….చెకింగ్ పాయింట్లు వద్ద కూడా ట్రక్కును ఆపకుండా తీసుకు వచ్చాడని పోలీసులు తెలిపారు .

Read: నటుడు సోనూసూద్ సేవలకు అమెరికా షెఫ్ ఫిదా..కొత్తరకం డిష్ చేసి సోనూ ఊరు పేరుపెట్టి కృతజ్ఞతలు