నడిరోడ్డుపై జవాన్ ని కాల్చేశారు

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2019 / 12:16 PM IST
నడిరోడ్డుపై జవాన్ ని కాల్చేశారు

Updated On : March 19, 2019 / 12:16 PM IST

బీహార్ లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై జవాన్ ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపేశాడు. ‘సోమవారం(మార్చి-19,2019) రాత్రి జరిగిన ఈ ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది. ముజఫర్ పూర్ జిల్లాలోని ఖాజి మొహమ్మద్ పూర్ లోని తానా ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) జవాను సుధీర్ కుమార్ మాంఝీ  ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నాడు. అదే సమయంలో ఇద్దరు యువకులు బైకుపై ఆ మార్గంలో వస్తున్నారు.
Read Also : సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి

వాహనాలకు అడ్డంగా బైకును ఆపడంతో.. బైకును పక్కకు తీయాల్సిందిగా సుధీర్ కుమార్ వారికి సూచించాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు జవాన్ తో గొడవకి దిగారు.  వారిలో ఓ వ్యక్తి సుధీర్ కుమార్ పై కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న సుధీర్ కుమార్ హాస్పిటల్ కు తీసుకువెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు.సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ముజఫర్ పూర్ ఎస్ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు.