Anantapur RTC Bus Mishap : అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. వాహనాల మీదకు దూసుకెళ్లిన బస్సు, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సును హిందూపురం డిపోకి చెందినదిగా గుర్తించారు. Anantapur RTC Bus Mishap

Anantapur RTC Bus Mishap (Photo : Google)
RTC Bus Mishap In Anantapur : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం మరువక ముందే అనంతపురంలో మరో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనంతపురం కలెక్టరేట్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వాహనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సును హిందూపురం డిపోకి చెందినదిగా గుర్తించారు. బస్సు నంబర్- AP02Z0499.
కాగా, ఈ ఉదయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో 10 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్ లోని 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు.
Also Read : విజయవాడ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ ఏం చెప్పాడంటే?
విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా.. ఫ్లాట్ ఫాంపైకి తీసుకొచ్చే క్రమంలో రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ ఫాంపై ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి వెళ్లిందని, దీంతో బస్సు చక్రాల కింద నలిగి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు.