ఇసుక మాఫియాపై దాడులు : 10 ట్రాక్టర్లు, లారీ సీజ్

  • Published By: chvmurthy ,Published On : March 19, 2019 / 08:06 AM IST
ఇసుక మాఫియాపై దాడులు : 10 ట్రాక్టర్లు, లారీ సీజ్

Updated On : March 19, 2019 / 8:06 AM IST

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది  మంగళవారం ఉదయం 6 గంటల నుండి నాకాబంది నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పట్టుకున్నారు.  

ట్రాక్టరు డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో పట్టణానికి సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ ను గుర్తించి, ఇసుక డంప్ ను, ఒక లారీని సీజ్ చేసారు. ప్రత్యేక తనిఖీలు ఇక మీదట నిత్యం వుంటాయని అక్రమ ఇసుక రవాణా చేస్తే సహించేది లేదని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.
Read Also : సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో సాయంత్రం 6 వరకు పోలింగ్