School bus overturns : పండుగ పూట విషాదం.. స్కూల్ బ‌స్సు బోల్తా.. ఆరుగురు చిన్నారులు దుర్మ‌ర‌ణం..

పండుగపూట సెలవు ఇవ్వుకుండా ఆరుగురు విద్యార్థుల మరణానికి కారణమయింది ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం.

School bus overturns : పండుగ పూట విషాదం.. స్కూల్ బ‌స్సు బోల్తా.. ఆరుగురు చిన్నారులు దుర్మ‌ర‌ణం..

School bus overturns in Haryana several kids Dead

School bus overturns in Haryana : హ‌ర్యానా రాష్ట్రంలోని మ‌హేంద్ర‌గ‌ఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. విద్యార్థుల‌ను తీసుకువెళ్తున్న ఓ ప్రైవేటు పాఠ‌శాల బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 20 మందికి పైగా విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

నేడు రంజాన్ సందర్భంగా పాఠ‌శాల‌ల‌కు సెల‌వు అయిన‌ప్ప‌టికీ కనైనా ప్రాంతంలో జీఎల్ ప‌బ్లిక్ స్కూల్‌ను య‌థావిధిగా తెరిచారు. ఈ క్రమంలోనే 4 నుంచి 10వ త‌ర‌గతి చ‌దువుతున్న దాదాపు 40 విద్యార్థులు బ‌స్సులో పాఠశాలకు వెళ్తుండగా జిల్లాలోని ఉన్‌హాని గ్రామ స‌మీపంలో విద్యార్థులు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు మ‌రో వాహ‌నాన్ని ఓవ‌ర్ టేక్ చేస్తున్న క్ర‌మంలో అదుపుత‌ప్పి బోల్తా ప‌డిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు.

Also Read: ఈ సిగరెట్లు తాగితే చావు ఖాయం..! రూ.2కోట్ల విలువైన నకిలీ సిగరెట్లు సీజ్

ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. గాయ‌ప‌డిన విద్యార్థుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే విద్యార్థుల త‌ల్లిదండ్రులు, పాఠ‌శాల సిబ్బంది ఆస్ప‌త్రికి చేరుకున్నారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే హరియాణా విద్యాశాఖ మంత్రి సీమా ట్రిఖా ఘటనాకి వ‌చ్చి పరిశీలించారు. విద్యార్థుల గురించి స‌మాచారం తెలుసుకున్నారు. కాగా.. బ‌స్సు డ్రైవ‌ర్ మ‌ద్యం సేవించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై సూపరింటెండెంట్ అర్ష్ వర్మ మాట్లాడుతూ.. మేము అతన్ని పట్టుకున్నాము. అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అతను నిజంగా తాగి ఉన్నాడా లేదా అనే విషయాన్ని మేము సరిగ్గా నిర్ధారిస్తాము అని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ 2018లోనే గడువు ముగిసినట్లు చెప్పారు.