Crime News: 3వ క్లాసు విద్యార్థినికి ఆ వీడియోస్ చూపించి దారుణానికి పాల్పడ్డ 12 ఏళ్ల బాలుడు

విషయం తెలియగానే ఇరు కుటుంబాలు కూర్చొని రాజీ కుదిర్చారు. దీని తర్వాత, నిందితుడైన మైనర్ విద్యార్థిని చదువుల కోసం వేరే నగరంలో ఉన్న బంధువుల వద్దకు పంపారు.

Crime News: 3వ క్లాసు విద్యార్థినికి ఆ వీడియోస్ చూపించి దారుణానికి పాల్పడ్డ 12 ఏళ్ల బాలుడు

Updated On : October 13, 2023 / 5:05 PM IST

Uttarakhand Crime News: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల ఓ మైనర్ బాలుడు.. తను చదువుతున్న పాఠశాలలోనే మూడో తరగతి విద్యార్థినికి పోర్న్ వీడియో చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. మూడు నెలల క్రితమే జరిగింది. ఇరు కుటుంబాలు ఇన్ని రోజులు దీనిపై మౌనంగా ఉన్నాయి. అయితే తాజాగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఎట్టకేలకు పోలీసులను కలిసి కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ నిందితుడు 7వ తరగతి చదువుతున్నాడు. బాధితురాలి ఇంటికి పోరుగింటి వ్యక్తి. బాధితురాలి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె వద్దకు వెళ్లి ఫోన్‌లో పోర్న్ వీడియో చూపించాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాధితురాలికి చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే కొద్ది రోజులకు విషయం బయటికి వచ్చింది.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వస్తున్న ఎస్సీ, ఎస్టీ బ్యూరోక్రాట్లు.. పోటీ పడుతున్న బీజేపీ, కాంగ్రెస్

కానీ, విషయం తెలియగానే ఇరు కుటుంబాలు కూర్చొని రాజీ కుదిర్చారు. దీని తర్వాత, నిందితుడైన మైనర్ విద్యార్థిని చదువుల కోసం వేరే నగరంలో ఉన్న బంధువుల వద్దకు పంపారు. కానీ కొన్ని వారాల తర్వాత, మైనర్ ఇంటికి తిరిగి రావడంతో, బాధిత విద్యార్థి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.