షర్మిల కేసు: ఐదుగురిని విచారించిన పోలీసులు

వైసీపీ అధినేత జగన్ సోదరిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర మైన వార్తలు పోస్టు చేసిన కేసులో 5గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

  • Published By: chvmurthy ,Published On : January 19, 2019 / 02:48 AM IST
షర్మిల కేసు: ఐదుగురిని విచారించిన పోలీసులు

Updated On : January 19, 2019 / 2:48 AM IST

వైసీపీ అధినేత జగన్ సోదరిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర మైన వార్తలు పోస్టు చేసిన కేసులో 5గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్: వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిలపై  సోషల్ మీడియా లో, యూ ట్యూబ్ లో  అసభ్యకర వ్యాఖ్యలతో అసత్య ప్రచారం చేసిన కేసులో  సైబర్ క్రైమ్ పోలీసులు ఇంతవరకు 60 వీడియో లింకులను గుర్తించారు. అవి ఏయే యూట్యూబ్ టానల్స్ కు సంబంధించినవో గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.  శుక్రవారానికి 15మందిని గుర్తించి, అందులో 5 గురిని అదుపులోకి తీసుకుని విచారించి, వారిని నిందితులుగా పరిగణిస్తూ వారికి సీఆర్పీసీ  సెక్షన్ 41 (ఏ) కింద నోటీసులు జారీ  చేశారు. 
పోలీసులు శని,  ఆదివారాల్లో మరి కొందరిని విచారించనున్నారు. ఈకేసుల్లో అసలు సూత్రధారులను గుర్తించటానికి, యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేసే వారి వివరాలు తెలుసుకునేందుకు, వీడియోలు అప్ లోడ్ ఐన ఐపీ అడ్రస్ లు తెలియచేయాల్సిందిగా పోలీసులు యూ ట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశారు.  యూ ట్యూబ్ లో ఉన్న 60 వీడియోల కింద అభ్యంతరకర కామెంట్స్ చేసిన వారిని కూడా గుర్తిస్తూ వారిని కూడా ఈకేసులో నిందితులుగా చేరుస్తున్నారు. మొత్తంగా  వీడియోలు అప్ లోడ్  చేసిన వారు, వాటిపై కామెంట్లు చేసిన వారి పూర్తి సమాచారం యూ ట్యూబ్ సంస్ధ నుంచి వచ్చిన తర్వాత అసలు నిందితులను గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసుల అధికారులు చెప్పారు.