అసోంలో పేలుడు ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు 

  • Published By: chvmurthy ,Published On : May 15, 2019 / 03:35 PM IST
అసోంలో పేలుడు ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు 

Updated On : May 15, 2019 / 3:35 PM IST

అసోం : అసోం లోని గువాహటిలో బుధవారం రాత్రి 8  గంటల సమయంలో గ్రెనేడ్  పేలుడు సంభవించింది.  ఈ పేలుడులో  ఇద్దరు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. గువహాటి లో రద్దీ గా  ఉండే జూ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్ద ఈ ఘటన సంభవించింది.  గాయపడిన వారిని గువహాటి లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేస్తున్నారు. గ్రెనేడ్ దాడి తామే చేసినట్లు యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ప్రకటించుకుంది.