గృహ ప్రవేశానికి ఏనుగును తీసుకొస్తే దారుణం : తొక్కిసలాటలో ఇద్దరు మృతి

కేరళలో గృహప్రవేశ కార్యక్రమం కాస్తా విషాదంగా మారింది. గృహప్రవేశానికి గోమాతకు బదులు ఏనుగును తీసుకువస్తే దారుణం జరిగింది.

  • Published By: veegamteam ,Published On : February 9, 2019 / 01:50 PM IST
గృహ ప్రవేశానికి ఏనుగును తీసుకొస్తే దారుణం : తొక్కిసలాటలో ఇద్దరు మృతి

కేరళలో గృహప్రవేశ కార్యక్రమం కాస్తా విషాదంగా మారింది. గృహప్రవేశానికి గోమాతకు బదులు ఏనుగును తీసుకువస్తే దారుణం జరిగింది.

కేరళ : గృహప్రవేశ కార్యక్రమం కాస్తా విషాదంగా మారింది. గృహప్రవేశానికి గోమాతకు బదులు ఏనుగును తీసుకువస్తే దారుణం జరిగింది. తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి చెందారు. ఈఘటన కేరళలోని గురువాయూర్ లో చేటుచేసుకుంది. గురువాయూర్ కొత్తపదిలో షైజు అనే వ్యాపారి తన కుటుంబంతో నివాసముంటున్నారు. షైజు కొత్తగా ఇల్లు నిర్మించాడు. తన బంధువులు, స్నేహితులను పిలిచి గృహప్రవేశ మహోత్సవం ఏర్పాటు చేశారు. గృహప్రవేశ కార్యక్రమానికి గోమాతను తీసుకురావడానికి బదులు ఘనంగా ఉండేలా గురువాయూర్ లోని దేవాలయం నుంచి 54 ఏళ్ల వయసు గల రామచంద్రన్ అనే పేరుగల ఏనుగును తీసుకువచ్చారు. 

ఆ ఏనుగు సమక్షంలో అత్యంత వైభవంగా గృహప్రవేశ మహోత్సవం జరుగుతుండగా, అంతలో పక్కింట్లో బాణసంచా కాల్చారు. బాణసంచా కాల్చిన శబ్దానికి బెదిరిన ఏనుగు.. వేడుకకు వచ్చిన అతిధులపైకి దూసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. గృహప్రవేశానికి వచ్చిన నారాయణ పెట్టేరి (66) తొక్కిసలాటలో అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి మరుగన్ (60)కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం  కున్నంకులం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

షైజు అనే వ్యాపారి వాస్తవానికి ఈ ఏనుగును దేవాలయంలో జరుగనున్న ఉత్సవం కోసం రప్పించాడు. అయితే దేవాలయ ఉత్సవానికి ముందు తన ఇంటి గృహప్రవేశానికి తీసుకురాగా ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా ఏనుగులను ఊరేగింపులకు వినియోగించరాదని కేరళ హైకోర్టు గతంలో తీర్పు చెప్పినా, దాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.