ఆవేశం : సెల్ ఫోన్ లో మాట్లాడవద్దు అన్నందుకు సూసైడ్ చేసుకున్న విద్యార్ధి

  • Published By: chvmurthy ,Published On : December 3, 2019 / 03:18 AM IST
ఆవేశం : సెల్ ఫోన్ లో మాట్లాడవద్దు అన్నందుకు సూసైడ్  చేసుకున్న విద్యార్ధి

Updated On : December 3, 2019 / 3:18 AM IST

ఎక్కువగా సెల్ ఫోన్ లో మాట్లాడొద్దని మందలించినందుకు ఓ  ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం…

బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధి, అల్మాస్‌గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే తంబాజీ మనుమడు లక్ష్మీకాంత్ (18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా.. ఇతను తరచూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడని తంబాజీ మందలించిచాడు. 

దీంతో మనస్తాపం చెందిన లక్ష్మీకాంత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్ట కోసం మార్చురీకి తరలించారు.