సుప్రీం తీర్పు: వివాహా బంధంతో ఒక్కటైన యువతులు

స్వలింగ సంపర్క నేరం కాదన్నసుప్రీం తీర్పు వాళ్లపాలిట వరం అయ్యింది.వివాహబంధంతో ఒక్కటైన ఒడిషా యువతులు

  • Published By: chvmurthy ,Published On : January 14, 2019 / 11:47 AM IST
సుప్రీం తీర్పు: వివాహా బంధంతో ఒక్కటైన యువతులు

స్వలింగ సంపర్క నేరం కాదన్నసుప్రీం తీర్పు వాళ్లపాలిట వరం అయ్యింది.వివాహబంధంతో ఒక్కటైన ఒడిషా యువతులు

భువనేశ్వర్‌: స్వలింగ సంపర్కం నేరం కాదని గతేడాది సెప్టెంబర్ 6న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ యువతుల పాలిట వరంగా మారింది. ఈతీర్పు ఆధారంగా ఒడిషాకు చెందిన ఇద్దరు యువతులు వివాహం చేసుకుని  హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ టాపిక్ అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. 
వివరాల్లోకి వెళితే ఒడిషాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు 2019 జనవరి 12 శనివారం వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. మహాకాలపరా కు చెందిన యువతి, పట్టముండైకు చెందిన మరో యువతి  కటక్ లోని ఒకే స్కూల్ లో చదువుకున్నారు. స్కూల్లో మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ,తర్వాత కాలంలో ఒకరిపై ఒకరు ఇష్టపడ్డారు. స్కూల్ లైఫ్ అయి పోయాక తామెక్కడ విడిపోతామో అనే భయంతో ఇదే బంధాన్నికొనసాగించాలని నిర్ణయించుకుని ఇంట్లో పెద్దలకు తెలిపారు.వీరి  నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇరువైపు పెద్దలు వారికి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.
ఇంట్లో పెద్దల వల్ల తాము కలిసి ఉండలేమని భావించిన వారిరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించారు. ఇద్దరు కలిసి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్‌ దాఖలు  చేశారు. తమ మిగిలిన జీవితం, కలిసి కొనసాగిస్తామని, భవిష్యత్తులో ఎటువంటి గొడవలు జరిగినా వాటిపై ఫిర్యాదు చేయబోమని వారు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పెళ్లి తన కూతురికి ఇష్టం లేదని ఓ యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. మరో యువతి బలవంతంతోనే తన కూతురు ఈ పెళ్లికి అంగీకరించిందని ఆయన ఆరోపించారు.