అత్తింటి వేధింపులకు TCS ఉద్యోగిని ఆత్మహత్య
ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచి ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన జీతం తెచ్చుకుంటున్నారు.

ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచి ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన జీతం తెచ్చుకుంటున్నారు.
హైదరాబాద్: ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచి ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన జీతం తెచ్చుకుంటున్నారు. జీవితం సంతోషంగా గడిచి పోతుందనుకున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధమే. కానీ మెట్టినింటి వారి వేధింపులతో ఆ యువతి అర్ధంతరంగా తనువు చాలించింది. మామ, భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక గత కొద్ది రోజులుగా పుట్టినింటిలోనే ఉంటోంది. అయినా పరిస్ధితులు మారి మళ్లీ భర్త తో కలిసి జీవించొచ్చనుకునే ఆశతో ఉంది. ఉన్నట్టుండి భర్త పంపించిన విడాకుల నోటీసు చూసి నిర్ఘాంత పోయి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం 9 అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
Read Also : సీఎం కేసీఆర్ కు కొత్త పాస్ పోర్టు
హైదరాబాద్ నిజాంపేట లో ఉండే చిప్పాడ పాండురంగా చార్య కుమార్తె మేఘనకు (30) హైదర్ నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి కొత్తపల్లి వినయ్ కుమార్ (32) తో 2017 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే మేఘన టీసీఎస్ లో ఉద్యోగం చేస్తోంది. 6నెలలు సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. కట్టుకున్న భర్త, మామ విడాకులు ఇవ్వాలంటూ వేధించసాగారు. దీంతో అత్తవారింటి నుంచి బయటకు వచ్చేసి ఏడాదిన్నరగా పుట్టింట్లోనే ఉంటోంది.
ఊహించని విధంగా గురువారం ఏప్రిల్ 4వ తేదీ భర్త వినయ్ కుమార్ నుంచి విడాకులు నోటీసు అందింది. ఊహించని ఈ ఘటనతో షాక్ కు గురైన మేఘన శుక్రవారం ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి, నేరుగా అత్తమామలు భర్త ఉంటున్న భవ్యాస్ ఎక్జోటికా అపార్ట్ మెంట్ కు వచ్చింది. కోడలు వస్తుందని ముందుగానే పసిగట్టిన ఆమె మామ మేఘను రానివ్వవద్దని సెక్యూరిటీకి చెప్పాడు. వేరే అపార్ట్ మెంట్ లో ఉన్న బంధువుల ఇంటికి వెళుతున్నానని చెప్పి వారితో మాట్లాడించి అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించింది.
ఎంత సేపటికి తమ ప్లాట్ కి రాకపోయేసరికి ఆమె బంధువులు సెక్యూరిటీ లో వాకబు చేశారు. అప్పటికే జరగరాని ఘోరం జరిగి పోయింది. అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన మేఘన తమ బంధువుల ఇంటికి వెళ్లకుండా నేరుగా 9 వఅంతస్తులోని టెర్రస్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. సమాచారం తెలుసుకున్న కేపీహెచ్ బీ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Read Also : హత్య చేసి శవంతో సెల్ఫీ : గంజాయి మత్తులో యువకుడి కిరాతకం