Terror Plot: కోడ్ భాషలో చాటింగ్, RSS నేతలే టార్గెట్! దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో కీలక అంశాలు…

ఆర్ఎస్‌ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు తెలిపాడు సిరాజ్. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పనులు చేద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు.

Terror Plot: కోడ్ భాషలో చాటింగ్, RSS నేతలే టార్గెట్! దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో కీలక అంశాలు…

Updated On : May 21, 2025 / 7:37 PM IST

Terror Plot: దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో సిరిజ్ ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, వరంగల్, విజయనగరం యువకులతో గ్రూప్ క్రియేట్ చేశాడు. సౌదీలో ఉన్న ఇమ్రాన్ ఆదేశాలతో అహం సంస్థను ఏర్పాటు చేశాడు సిరాజ్. అహం సంస్థ కోసం 40 లక్షల నగదును సిరాజ్‌కు పంపాడు ఇమ్రాన్.

పేలుళ్లకు కేసులో సిరాజ్‌, సమీర్‌ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్, సమీర్ ఫోన్‌ చాటింగ్స్‌ రిట్రీవ్ చేశారు పోలీసులు. ఇన్‌స్టాలో కోడ్‌ భాషలో సిరాజ్, సమీర్ మాట్లాడుకున్నారు. అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ చేశారు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించాడు. కెమికల్ ల్యాబ్‌కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు.

Also Read: పాకిస్థాన్ స్కూల్లో సూసైడ్ కార్ బాంబ్.. చిన్నారులు మృతి..

ఆర్ఎస్‌ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు తెలిపాడు సిరాజ్. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పనులు చేద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్‌లో చూపెట్టుకున్నాడు సిరాజ్. 12 మంది కలిసి గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుకుందామని తెలిపాడు సిరాజ్.