లాట్‌లో లూటీ : జగిత్యాలలో సెల్‌ఫోన్‌ షాపుల్లో చోరీ

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 03:23 PM IST
లాట్‌లో లూటీ : జగిత్యాలలో సెల్‌ఫోన్‌ షాపుల్లో చోరీ

జగిత్యాల : సైలెంట్‌గా ఎంటర్ అయ్యారు…అర్ధరాత్రి వేళ జగిత్యాల పట్టణంలో దొంగల చేతివాటం..కోటి రూపాయల దాక లూటీ…ఈ లూటీ సీన్‌లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో హల్ చల్ చేసిన చోరులు ఇప్పుడు జిల్లా కేంద్రాలపై కన్నేశారు. పక్కా రెక్కీ నిర్వహించి పంజా విసురుతున్నారు. అర్ధరాత్రి వేళ జగిత్యాల పట్టణంలో రెండు సెల్‌ఫోన్ షాపుల్లో చోరికి పాల్పడ్డారు. 
అంగడి మార్కెట్…
జగిత్యాల పట్టణంలో అంగడి మార్కెట్‌లో ఉన్న లాట్, మరొక సెల్ ఫోన్ షాపులో 2019, జనవరి 08వ తేదీ అర్ధరాత్రి చోరీ జరిగింది. పక్కా రెక్కీ నిర్వహించిన ఈ దొంగలు బొలెరో వాహనంలో ఎంట్రీ ఇచ్చారు. లాట్ మొబైల్ షాపు దగ్గర వాహనాన్ని అడ్డంగా ఆపేశారు. షట్టర్‌ను పైకి లేపి దొంగలు దుకాణంలోకి ఎంట్రీ ఇచ్చారు. నలుగురు దొంగలు టార్చ్ లైట్..సహాయంతో ఖరీదైన సెల్ ఫోన్‌లను బ్యాగుల్లో  సర్దేశారు. సీసీ కెమెరాలో సీన్ సీన్‌లు రికార్డయ్యాయి. ఓ వ్యక్తి కన్ను కౌంటర్‌పై పడింది. కౌంటర్‌లో ఉన్న నగదును జేబులో వేసుకున్నాడు. అనంతరం వచ్చిన వాహనంలో వెళ్లిపోయారు. పక్కనే ఉన్న మరో షాపులో కూడా దొంగతనానికి పాల్పడ్డార. చోరీ విలువ సుమారు రూ. కోటి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.