Delhi School : ఢిల్లీలో స్కూల్ కు బాంబు బెదిరింపులు

బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.

Delhi School : ఢిల్లీలో స్కూల్ కు బాంబు బెదిరింపులు

Threats

Updated On : April 12, 2023 / 2:20 PM IST

Delhi School : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్ నగర్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో బాంబు పెట్టిన్నట్లు ఉదయం 10.49 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను హుటాహుటినా అక్కడి నుంచి పంపించారు.

బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే పాఠశాల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Bomb hoax: స్కూల్లో బాంబు పెట్టామని ఈ-మెయిల్ పంపి అందరినీ పరుగులు పెట్టించిన వ్యక్తి

ఈ మేరకు బాంబు బెదిరింపులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో కూడా స్కూల్స్, పలువురు వ్యక్తులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫోన్ చేసి బాంబులు పెట్టినట్లు బెదిరించారు. మరికొంత మంది ప్రముఖలకు చంపేస్తామని బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వచ్చిన సంగతి తెలిసిందే.