Advocate Attacked : పట్టపగలు అందరూ చూస్తుండగా అడ్వకేట్‌పై దాడి

కోర్టులో కేసు వాదించే లాయర్లపై   ప్రతి నాయకుడు తన మనుషులతో దాడి చేయటం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి   వార్తలు వింటాం.

Advocate Attacked : పట్టపగలు అందరూ చూస్తుండగా అడ్వకేట్‌పై దాడి

Advocate Attacked Mumbai

Updated On : July 19, 2021 / 4:19 PM IST

Advocate Attacked : కోర్టులో కేసు వాదించే లాయర్లపై   ప్రతి నాయకుడు తన మనుషులతో దాడి చేయటం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి   వార్తలు వింటాం. కానీ….ముంబైలోని బోరివాలి ప్రాంతంలో రద్దీగా ఉండే వీధిలో ఆదివారం మధ్యాహ్నం పట్టపగలు అందరూ చూస్తుండగా సత్యదేవ్ జోషి అనే న్యాయవాదిపై కొంతమంది వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు.

ఇనుపరాడ్లు, కర్రలు పట్టుకుని దుండగులు జోషిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడిని ఆపేందుకు స్ధానికంగా గూమికూడిన ప్రజలు కొందరు ప్రయత్నించినప్పటికీ దుండగులు వారిపై కూడా దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన న్యాయవాది జూహూలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే  ఉందని  ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారు.

దాడికి సంబంధించి దాహిసర్ లోని ఎంహెచ్‌బీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దాడిలో 15 మంది వరకు పాల్గోన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు విచారణలో ఉన్న కేసులో న్యాయవాది వాదించటమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు.  దాడికి సంబంధించిన వీడియోను ఒక అడ్వకేట్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.