Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మృతి

ఏపీలోని ప్రకాశం జిల్లాలో, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు.

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మృతి

Road Accident

Road Accident Prakasam District : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ ద్విచక్ర వాహనంను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మరణించారు. స్థానికల సమాచారంతో ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, మృతులంతా అంబాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్ర‌లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident: వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మందమర్రి మండలంలో అందుగులపేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. మృతులు ఏపీలోని అనంతపురం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి నాగ్‌పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.