Tamil Nadu : కంచె దాటుతుండగా కరెంట్ షాక్ .. మూడు ఏనుగులు మృతి

తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. మూడు ఏనుగులు కరెంట్ షాక్ తో మృతి చెందాయి. ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో కంచె దాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి.

Tamil Nadu : కంచె దాటుతుండగా కరెంట్ షాక్ .. మూడు ఏనుగులు మృతి

Three elephants electrocuted while crossing fence

Updated On : March 7, 2023 / 11:22 AM IST

Tamil Nadu : తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. మూడు ఏనుగులు కరెంట్ షాక్ తో మృతి చెందాయి. ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో మంగళవారం (మార్చి 7,2023) కంచె దాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి. కాళీ కౌండర్ కొట్టాయ్ గ్రామంలో అడవిపందుల నుంచి పంటను కాపాడుకోవటానికి ఓ రైతు తన పొలానికి కంచె వేశారు.ఆకంచెకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశాడు. ఈక్రమంలో కంచె దాటటానికి ఏనుగుల గుంపు యత్నించింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురి అయిన మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి.

కాగా తమిళనాడులో రైతులు జంతువుల నుంచి తమ పంటను కాపాడుకోవటానికి తమ పొలాలకు ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో సంచరించే ఏనుగుల గుంపులు కంచెలను దాటుకుని..రోడ్లు దాటి సంచరిస్తుంటాయి. ఆహారం కోసం నీటి కోసం ఏనుగుల గుంపు సంచరిస్తుంటుంది. ఈక్రమంలో కొంతమంది రైతులు అక్రమంగా కంచెలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి ఇలా ఏనుగులు ప్రాణాలు కోల్పోతుంటాయి. కాగా అక్రమంగా కంచెలకు విద్యుత్ ఏర్పాటు చేయటం వలన ఏనుగులు మృతి చెందిన ఘటనపై అటవీశాఖ అధికారులు సదరు రైతులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అటవీ జంతువులకు ఎటువంటి ప్రమాదం జరిగినా దానికి సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోటం జరుగుతుంటుంది.